భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, June 07, 2007

గురుః దేవో నారాయణః ౨

కం. అరవైనాలుగు మాత్రల
అరుదు అయిన ఒ అరవింద హారం కందం;
నెరయును మదినానందము
నెరగగ నే రాయడమును, నేర్పగ రామా !

నాకెందుకో పద్యం మొదటి రెండు పాదాలు ఎడ్లబండి లాగా, ఆఖరి రెండు పాదాలు రైలు బండిలాగా అని పిస్తున్నాయి. :)
రామా (రానారె) స్ఫుర్తి తో నేను కూడా కంద పద్యం రాద్దామని తలపెట్టా. సంవత్సరం పడుతుందను కున్న దానికి, గురువు గారి సహాయ ప్రోత్సాహాలతో, రెండు రోజులలోనే పూర్తయింది. పద్యం అంత బాగోదనుకోండి, నేను కొక ని కాబట్టి! (కొత్త కవి).
మా గుగ్గురువు కొత్త పాళీ అన్నట్టు..

క. కందాలకేమి భాగ్యము
వందైనా రాయ వచ్చు వడిగా, కానీ
ఛందస్సున వ్రాయుచునే
యందముగా వ్రాయవలెను యర్రపు రామా!

నాకైతే ఛందస్సు, యతిమైత్రి, ప్రాస కుదిరినందుకు మహదానందంగా ఉంది.

15 comments:

  1. చక్కటి టపా. పద్యం నాకు బాగా నచ్చింది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. కం.
    వహవా! రాకేశా! మది
    మహదానందమునఁదేలె! పద్దియ కవితా
    గహనపు కుహరమునందున
    సెహబా'సాచంట'వారి శిశువనిపించావ్!!

    ReplyDelete
  4. క్లాసులోకి కొత్త స్టూడెంట్ అన్నమాట. స్వాగతం రాకేశ్వర రావు గారూ...పద్యం అందంగా ఉంది.

    రేగింగ్ చేసి భయపెట్టాలని కాదుకానీ చెప్పక తప్పదు.
    "అరుదు అయిన" అని విడి విడి గా రాయకూడదు. ఉత్తునకు సంధి నిత్యము. అందుచేత "అరుదైన" అని సంధి చేసే ప్రయోగించాలి. గురువుగారి ఒరిజినల్ పోస్ట్లో వ్యాఖ్యానించినట్టు "సాధనమున పనులు సమకూరు ధరలోన..." ఈ ఊపు ఇలాగే కొనసాగించండి.

    ReplyDelete
  5. మంచి మొదటి ప్రయత్నం.

    "పద్యం మొదటి రెండు పాదాలు ఎడ్లబండి లాగా, ఆఖరి రెండు పాదాలు రైలు బండిలాగా అని పిస్తున్నాయి. :)"
    అహ్హహ్హ. ఇది మరీ బాగుంది :-)

    "ఛందస్సున వ్రాయుచునే
    యందముగా వ్రాయవలెను"
    పద్యానికి ప్రాణం - elegance. You want to maximize the elegance.
    ఇప్పుడు నీకో ఎసైన్మెంటు - నీ పద్యం చివరి రెండు పాదాల్ని తిరగరాయి! maximizing the elegance

    ReplyDelete
  6. రాకేశా, అసలు సంగతి - గుగ్గురువులోని రెండో అక్షరం తీసేసి, అలా ఖాయం చేసెయ్. అడుక్కునేవాడిదగ్గర (అంటే నాదగ్గర) బుడుక్కోకుండా ఇక నుండీ నేరుగా అడుక్కో :)

    ReplyDelete
  7. Oyi bulli guruvu gArU, An&lain^ nighaMTuvu rifaren&sulu bAnE peTTAv gAnI ...
    "gahanapu kuharamu" aMTE punaruktaM kAlEdA? :))

    ReplyDelete
  8. ఓయి బుల్లి గురువు గారూ, ఆన్లైన్ నిఘంటువు రిఫరెన్సులు బానే పెట్టావ్ గానీ ...
    "గహనపు కుహరము" అంటే పునరుక్తం కాలేదా? :))

    ReplyDelete
  9. గహనము అంటే అరణ్యమనికూడా ఉందిగదా, ఈమారు కొంచెం అలా సర్దుకుపొండి గురూజీ :) పద్యారణ్యపు గుహలోనికి చొరబడే సాహసం చేసిన శిశువు ఈ వంశతిలకుడని ఇంకో శిశువు పొగడ్త అన్నమాట. పరోక్షంగా ఇది స్వకీర్తనమే :))

    ReplyDelete
  10. మూడోపాదం కొద్దిగా మారిస్తే...

    కం.
    వహవా! రాకేశా! మది
    మహదానందమునఁదేలె! పద్దియ కవితా
    గహనపు కుహరముఁజొరబడి
    సెహబా'సాచంట'వారి శిశువనిపించావ్!!

    ReplyDelete
  11. These are written by Sridhar Rapelli

    కఠినపు పలుకులు పలుకక |
    మఠమున బడి తడబడకయు | మదము నిడచియున్ |
    కఠిన నియమముల నెగడియు |
    హఠమిడచి అచల పథమున | అడుగిడ యోగీ! ||

    జిలిబిలి పలుకుల కులుకులు |
    జలజల రవముల విఱుపులు | జగతి ప్రగతియున్ |
    గిలిగిలి హిమకర వలపులు |
    సలసల ద్రవ నురుగులు కల! | సమయింపుమిదే? ||

    మమకారము మదినుంచియు |
    మమతల తోడను జగమున | మానక నడువన్ |
    యమపురి కేగని నుడివిన |
    మమకారద్వేష రహిత | మహయోగ నిధీ! ||

    ఎవ్వరి పనులను జూడగ |
    నవ్వారలు జేసుక మది | ననవరతమునన్ |
    నొవ్వించక తము వగవక |
    నవ్వించుచు తిరుగు వారె | నరయ స్వతంత్రుల్! ||

    ReplyDelete
  12. కం || చందన చెట్టుకు పాములు |
    అందముగా చుట్టుకొన్న | అంటునె గంధం? |
    పొందిక గురుని పాదము |
    విందని గని ఖలుడు బట్ట | పొందునె మోక్షం? ||

    ReplyDelete
  13. కం || చందన చెట్టుకు పాములు |
    అందముగా చుట్టుకొన్న | అంటునె గంధం? |
    పొందిక శ్రీగురు పాదము |
    విందని గని ఖలుడు బట్ట | పొందునె మోక్షం? ||

    ReplyDelete
  14. కం || సృష్టి రహస్యము దెలియగ |
    స్పష్టముగా పిసినికాయ | పద్ధతి గనరో? |
    సృష్టికి మొత్తము బ్రహ్మము |
    స్రష్టయనియు దెలియలేరు | రయమున మనుజుల్ ||

    ReplyDelete
  15. కం || చందన చెట్టుకు సర్పము |
    అందముగా చుట్టుకొన్న | అంటునె గంధం? |
    ముందుగ శ్రీగురు పాదము |
    పొందికగను ఖలుడు బట్ట | పొందునె మోక్షం? ||
    In the previous two verses found errors, this is the corrected one. Happy reading

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం