భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, June 05, 2007

Inscript వల్ల లాభాలు

ఉపోద్ఘాతం : తెలుగు బ్లాగర్ల గుంపు లో జ్యోతి గారు ఇన్‌స్కిరిప్టు వల్ల ఉపయోగాలగురించి అడిగారు, దానికి నా సమాధానంగా ఈ టపా అక్కడ రాసాను. రానారె సలహా మీద దానిని ఇక్కడ ఒక బ్లాగు టపాగా ప్రచురిస్తున్నా (చిన్న చిన్న మార్పులతో). అన్నట్టు అసలు టపా ముందు ఒక చిన్న ప్రయత్నం.
ఆ కుక్క ప్రయత్నం పని చేసినట్టు లేదు, అసలు టపా చదవండి.

జ్యోతి గారు,

ఈ విషయం మీద "Inscript వల్ల లాభాలు" అని ఒక బ్లాగు రాద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా . కాని కుదరట్లేదు. మీ ప్రశ్నకు క్లుప్తంగా ఒ నాలుగు కారణాలు రాస్తా..

౧) తెలుగు ను ఆంగ్లం ద్వారా టైప్ చేయడం కొందరికి ఇష్టం ఉండదు.
ఉదాహరణకు మనం, సంతోష్ ని RTS లో SaMtOsh అని టైపు చేయాలి , అది చదవడానికి సమ్తోష్ లాగా అనిపించట్లేదు ?

౨) "ఒకవేళ మనం ఇంగ్లీషు, తెలుగు ఒక దాని తర్వాత రాసుకునే పని ఉంటే తికమకగా ఉంటుంది కదా."
ఇది అస్సలు నిజం కాదు. మనం తెలుగు లో ఆలోచిస్తున్నప్పుడు , టైపు చేస్తున్నప్పుడు తెలుగు కీ బోర్డ్ మన మెదడులో లోడ్ అయి పోతుంది. నేను ఆంగ్లం లోనూ, తెలుగులోనూ, కీబోర్డు చూడకుండా చాలా వేగంగా టైపు చేయగలను. కొన్ని టపాల తరువాత మీరు కూడా అలాగా అవుతారు.

౩) Left Alt + Shift నొక్కితే, భాష మారుతుంది. క్లిక్కుల అవసరంలేదు..

౪) అచ్చులు అన్ని ఒక చోట , హల్లులు ఒక చోట చాలా క్రమబధ్ధంగా అమర్చబడి ఉంటుంది తెలుగు కీ బోర్డు.
ఉదాహరణకు. క పైనే గ , చ పైనే జ ఉంటాయి.

౫) మీకు తెలుగు కీ బోర్డు అలవటైతే , ఎ దేశ బాషలోనేనా రాయవచ్చు.
മീകു തെലുഗു കീ ബോര്ഡു അലവാടൈതേ , എ ദേശ ഭാഷലോനേനാ രായവച്ചു
(ఉదాహరణకు , పై వాఖ్యం మలయాళంలో )

౬) మీకు కీ స్ట్రోక్స్ తగ్గుతాయి. ఉదాహరణకు క్షంత్రైజ్ఞ అనడానికి తెలుగు కీబోర్డులో 5 మీటలు నోక్కాల్సి వస్తే, RTS లో 12 మీటలు నొక్కాలి ! మరీ ఎప్పుడూ ఇంత రాబడి ఉండదు కాని, సగటున తక్కువ మీటలు అవసరమౌతాయి.

౭) నేను gtalk లో తెలుగు వచ్చిన వారితో అచ్చమైన తెలుగులో చాటుతూంటాను. మీరు ఇది చేయొచ్చు. ఒక సారి వీవెన్ తో కూడా చాటు చేసా! ఆయన కూడా ఇన్‌స్కిరిప్టే వడతారు !

౮) కాపీ పేస్టు సుత్తి ఉండదు. వేరే ప్రోగ్రాంలు ఇన్స్టాల్ చేయనక్కరలేదు.

౯) ఇంటర్నెట్ సౌకర్యం లేని మా పల్లెటూర్లలో కంప్యూటర్ వాడాలనుకునేవారు , తెలుగులో వ్రాయెచ్చు. (నేను inscript వాడడం అందు వల్లే మొదలు పెట్టాల్సి వచ్చింది)

౧౦) మీ కంప్యుటర్ లో ఫైళ్ళ పేర్లు తెలుగు లో పెట్టుకోవచ్చు. నేను కంద పద్యాల గురించి నోట్సు రాసుకుని కందం.doc గా దానిని బధ్రపరచుకోవచ్చు.

౧౧) అంకెలని సునాయాసంగా తెలుగులో కొట్టోచ్చు

ఇన్ని చెప్పాక కూడా మీరు మీ మనస్సు మార్చుకోకపోతే నాకు బాధగా ఉంటుంది. (Emotional blackmailing :)

రాకేశ్

12 comments:

  1. Inscript వుపయోగించడానికి కారణం ఇప్పటి వరకు OS లెవెల్ లో Phonetic Keyboard(RTS) లేక పోవడమే. కాని ఈ మద్య నే MicroSoft Phonetic Keyboard release chesiMdhi.దీని గురించి http://mdileep.wordpress.com లో రాసాను. పైన మీరు చెప్పిన వుపయోగాలు అన్ని ఈ కీ బోర్డ్ కు వుంటాయి. Inscript ను తప్పు పట్టడం లేదు. కాని మరో కీ బోర్డ్ లేఅవుట్ జ్ఞాపకము వుంచుకోవలసిన అవసరం వుండదు.

    ReplyDelete
  2. ऱाकेष గారు,
    చాలా బాగా రాసారు. మీరు రాసిన మొడటి, ఆరవ లాభాలు తప్ప మిగతావి అన్ని మైక్రోసాఫ్ట్ ఫనెటిక్ టూల్లో ఉన్నాయి. ఇన్ స్క్రిప్ట్ కీ బోర్డ్ నేర్చుకోవడం కష్టం అనుకున్న వారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. నా అభిప్రాయాలు ఇక్కడ చదవండి.

    ReplyDelete
  3. వేగంగా రాయాలంటే ఇన్‌స్క్రిప్టు కావలసిందే. జీటాక్ లాంటి వాటిలో సుభంగా తెలుగులో ఛాటింగ్ చెయ్యాలంటే ఇదే మార్గం. ఇన్‌స్క్రిప్టుకు అలవాటైనంతవరకే కష్టం. ఆ తరువాత దూసుకుపోవడమే.

    ReplyDelete
  4. మంచి టపా. కాకుంటే దిలీప్ గారు, గిరి గారు అన్నది కూడా సబబు గానే అనిపిస్తుంది. రానారే అన్నది - inscript ద్వారా వేగవంతమైన టైపింగ్ - నూటికి నూరుపాళ్ళు నిజం.. కానీ, ఒక స్థాయి వేగాంలో టైపు కొట్టే వారికి ఆ వేగం వల్ల పెద్ద తేడా ఉండదేమో అని నా అనుమానం. కాబట్టి ఏ లేఅవుట్ ఉపయోగించుకున్నా కూడా పెద్ద తేడా ఉండదు అనుకుంటా.

    ReplyDelete
  5. బొమ్మ భలే ఉంది. ఎక్కడిది? :)

    ReplyDelete
  6. @ దిలీప్, గిరి, సౌమ్య
    ఇన్ స్క్రిప్టు యొక్క ముఖ్య లాభం తెలుగుని ఆంగ్ల కోరలనుండి తప్పించడం.
    ఆంగ్లం అక్షరాలలో ఆలోచించి తెలుగులో వ్రాయల్సిన కర్మ మనకు లేదు. ౫౬ అక్షరాలను ౨౬ ద్వారా వ్యాయడం information theory ప్రకారం కూడా చాలా inefficient.

    @ రానారె
    బొమ్మ national lampoon మాసపత్రిక కవరుల్లో ఒకటి. ఆంగ్ల లిపిని నేను జింప్ లో కూర్పు చేసి నాకు కావలసిన తెలుగు లిపి అక్కడ జోడించాను .

    ReplyDelete
  7. రాకేశ్వరా అంతా బాగానే ఉన్నదికాని ఆఫీసు లొ ఉన్నప్పుడు తెలుగు టైపు చేయవలసి వస్తే కిటికి సెట్టింగ్స్ లొ తెలుగు భాష లేకపోతే టైపింగ్ కష్టం అవుతుంది కదా. ఇప్పుడు లేఖిని అలవాటు అయ్యింది. అది మాని ఇన్‌స్కరిప్ట్ నేర్చాననుకో రెంటికి చెడ్డ రేవడి ని అవుతాను కదా నీ అభిప్రాయం తెలుపుము....

    ReplyDelete
  8. hello... naaku koodaa inscript vaadaalani undi.. kaani naaku telugu lo type cheyyatam raadu. eedainaa nerchukone maargam choopinchagalaraa..?

    ReplyDelete
  9. ఆదిబ్లాగ్వరులు, గురువుగారు కూడా మన దారిలోకి వస్తున్నారు. :-)

    ReplyDelete
  10. Hi, inscript lo 'ottulu' ela type cheyali, i am trying for the last 2 days but with no luck. can u please put a comemnt on my blog if possible?

    ReplyDelete
  11. Use Shift to get vattulu.
    shift + ka = kha etc.
    Simple na...

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం