భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, June 18, 2007

నాకు శివాజీ సినిమా ఎందుకు నచ్చింది

అవును సిగ్గు విడిచి చెబుతున్నా నాకు శివాజీ సినిమా నచ్చింది.
ఈ సినిమా రజినీ వీరాభిమానులకు నచ్చదు. ఎందుకంటే రజినీని దేవుడిలాగా చూపించలేదు. చిల్లరచిల్లర డైలాగులు పెట్టి, ఒకటో రెండో ఉన్నాయంతే. ఇంకా చెప్పాలంటే, "అడ్డమైన డైలాగులు వీధిలో ప్రతీ ఒక్కడూ కొడుతున్నారు" అని డైలాగ్ కూడా ఉంది. ఇకపోతే "ఇకచూడు కమల్ హాసన్ లాగా తెల్లగా అయ్యిపోతా" లాంటి లో-ఇగో డైలాగులు బాగా నచ్చాయి.

స్టోరీ - అన్ని శంకర్ సినిమాల్లాగానే, ఒకడొచ్చి దేశాన్ని, నిజజీవితంలో వీలవని విధానాలలో బాగుచేసేస్తాడు. ఆ విషయంలో ఇది మిగితా రజనీ సినిమాలకంటే పర్లేదు.

ఇంకోవిషయం - నేను ఈ సినిమాకి ముందు చూసిన తెలుగు సినిమాలు యోగి, అన్నవరం, బంగారం, పోకిరి వగైరా .
కాబట్టి అర్థంలేని హింసా ఖాండ, మరియు అదే రసంలేని కథనం ఉన్న సినిమాలు చూసి చూసి ఈ సినిమా చాలా నయమనిపించింది.

మీరు రజనీ వీరాభిమాని అయినా లేదా శంకర్ వీరాభిమాని అయినా అయితే మీకీ సినిమా నచ్చదు, నేను రెండూ కాదు. అలాగే మీకు సినిమా లో లాజిక్ కావాలంటే, మీరసలు తెలుగు సినిమాలే చూడకూడదు.

ఈ సినిమా శంకారాభరణం కానేకాదు, కనీసం భారతీయుడు కుడా కాదు, కానీ నాకైతే సినిమా నచ్చింది.

వేరే రివ్యూలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

2 comments:

  1. నేను రజనీ కి పెద్ద ఫాన్ ఏమీ కాదు (ఇది నాకు ధియేటర్ లో మొదటి రజనీ సినిమా), బట్ ఆయన అంటే కొంత ఫాసినేషన్ ఉన్న మాట నిజం . ఇక శంకర్ నటే నాకు అసలే పడదు , (i loathe this guy for bottom my heart), కానీ సినిమా నచ్చలేదు , ఆయన సినిమాలు అన్నీ ఇలాగే ఉన్నా , rajani ఫర్స్ట్ డే xperience కావటం తో కొంత aversion , అలవాటు చేసుకోవాలేమో ఇలాంటి సినిమాలకి.

    ReplyDelete
  2. ఆఫీసు నుండి నేరుగా సినిమాకెళ్లి ఇప్పుడే వస్తున్నాను. సినిమా నాకూ నచ్చింది. సుమన్‌ని చూసి అవాక్కయ్యాను. చాలాబాగా చేశాడు. వివేక్ గురించి చెప్పనక్కరలేదు. శ్రేయ బాగుంది. ఇక్కడ తెలుగులో విడుదలవ్వలేదు. థియేటర్లో నా మొదటి తమిళ చిత్రం, రెండవ రజనీకాంత్ చిత్రం. ఈ సినిమా నాకు హాయిగొలపడానికి గల కారణాల్లో ఇటీవల చూసిన చెత్త తెలుగు సినిమాలు ప్రథమమైనవి. అనుకున్నట్టుగానే థియేటర్లో సరైన సౌండుసిస్టమ్ లేదు. మొత్తానికి ఇది మంచి వినోదాత్మక చిత్రం.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం